అది నేనేనా నమ్మలేకపోతున్నా.. జానీ రోజుల్ని గుర్తు చేసుకున్న రేణు దేశాయ్!

May 28, 2024

అది నేనేనా నమ్మలేకపోతున్నా.. జానీ రోజుల్ని గుర్తు చేసుకున్న రేణు దేశాయ్!

టాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలాగే ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. రేణు దేశాయ్ తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన పిల్లలకు సంబంధించిన వార్తలు వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది.

తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది రేణు దేశాయ్. ఇకపోతే ఇటీవల కాలంలో తరచూ రేణు దేశాయ్ ఏదో ఒక పోస్టుతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కూడా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా రేణు దేశాయ్ తన జానీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. జానీ సినిమాలో రేణు దేశాయ్ సీన్‌ను ఇప్పుడు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అందమైన అమ్మాయి అంటూ రేణు దేశాయ్ రీల్ వీడియోని ఫ్యాన్స్ షేర్ చేస్తూ జానీ మూవీని మళ్లీ అందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో చివరకు రేణు దేశాయ్ వద్దకు చేరడంతో ఆమె ఆ రీల్స్ పై స్పందించింది.

ఇది నేనేనా? అస్సలు నమ్మలేకపోతోన్నాను అంటూ రేణూ దేశాయ్ నవ్వుతున్న ఏమో ఇది షేర్ చేసింది. రేణూ దేశాయ్ చివరగా కనిపించిన చిత్రం జానీ. బద్రి తరువాత జానీలో మాత్రమే రేణు కనిపించింది. పవన్ కళ్యాణ్‌ తో చేసిన ఈ రెండు చిత్రాలు అభిమానుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జానీ సినిమాకు సంబంధించిన పోస్టులు వేస్తూ వచ్చారు.

Read More: పెళ్ళికి ముందే ఒకే రూమ్ లో గడిపాను.. వేరె అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయ్యింది: జీవితా రాజశేఖర్ 

ట్రెండింగ్ వార్తలు