త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా… సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్!

June 8, 2024

త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా… సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్!

రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు సినీ నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అనంతరం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతున్నారు. అయితే ఈమె తరచు తన రెండో పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడిస్తూ వచ్చారు.. ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

గతంలో ఓ వ్యక్తితో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈమె అనంతరం పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే తాను రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని పలు సందర్భాలలో చెప్పిన రేణు దేశాయ్ తాజాగా మరోసారి తన రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అనే విషయాలను కూడా వెల్లడించారు.

తాను మరొక మూడు సంవత్సరాలలో రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని అందరిలాగే నాకు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉందని తెలిపారు. అయితే ఇన్ని రోజులు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాను విడాకులు తీసుకున్న వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అప్పటికి నా పిల్లలు ఇద్దరు చాలా చిన్న వారు వారికి ఒక కేర్ టేకర్ అవసరం.

నేను రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎక్కువ సమయం నా భర్తకే కేటాయించాల్సి ఉంటుంది అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇక ప్రస్తుతం నా పిల్లలకు నా అవసరం లేదు వారికంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది. అందుకే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నా రెండో పెళ్లికి పిల్లలు కూడా వ్యతిరేకం కాదు అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: రామోజీరావుకు టాలీవుడ్ ఘన నివాళి.. రేపు షూటింగులు బంద్!

ట్రెండింగ్ వార్తలు