పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. సంతోషంగా ఉన్నారంటూ?

June 5, 2024

పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. సంతోషంగా ఉన్నారంటూ?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలబడ్డాయి అయితే ఈ ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. 164 సీట్లతో కూటమి విజయకేతనం ఎగరవేసింది. ఇక కూటమి ఈ స్థాయిలో విజయం పొందటానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా కారణమని చెప్పాలి. జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ స్థాయిలో మెజారిటీ వచ్చిందని కూడా చెప్పవచ్చు.

ఇక జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఇక ఈయన ఇక్కడ ఏకంగా 70000 మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేస్తూ పరాజయం పాలవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజారిటీతో గెలవడంతో అభిమానులు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు..

పవన్ కళ్యాణ్ గెలుపు పై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ గెలుపు పై స్పందించారు.

తన పిల్లలు అకిరా ఆద్య ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారని ఆశిస్తున్నాను అంటూ తన ఇంట్లో ఆధ్య సంతోషకరమైన క్షణాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అయింది. ఇకపోతే అకీరా తన తండ్రి గెలవగానే మంగళగిరికి చేరుకున్నారు. తన తండ్రితో పాటు చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి మనకు తెలిసిందే.

Read More: కల్కి నుంచి బిగ్ అప్డేట్.. 10 న రాబోతున్న ట్రైలర్?

ట్రెండింగ్ వార్తలు