నా ఫీలింగ్స్ కి విలువలేదు.. కామెడీలు చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్!

June 8, 2024

నా ఫీలింగ్స్ కి విలువలేదు.. కామెడీలు చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్!

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చి తన జీవితం తాను జీవిస్తూ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈమె వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్లు చేస్తూ తనని ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇలా రేణు దేశాయ్ ఎన్నో సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవకు కూడా దిగారు.

అయితే ఇటీవల కాలంలో రేణు దేశాయ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా తన కొడుకు అకీరాను కూడా వెంట తీసుకు వెళ్తూ ఉన్నారు. దీంతో రేణు దేశాయ్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన కొడుకుని వెంట తీసుకెళ్ళారు.

ఇలా తన కొడుకు ఇంత చిన్న వయసులోనే గొప్ప వారిని కలిసే అవకాశం రావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీతో తన కొడుకు కలిసి దిగిన ఫోటోలను ఈమె షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాను కట్ చేసి ఫోటోలను షేర్ చేయడంతో పవన్ అభిమానులు ఈ ఫోటోలు పై వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.

ఈ ఫోటోలు షేర్ చేసిన ఈమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు మెసేజ్లు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.నా బాధ వాళ్లకు నవ్వులాటగా మారింది.. తన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ లేదని.. ఎందుకంటే తాను రోబో అంటూ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో కామెంట్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు. తనకు జరిగినట్లు.. వాళ్లకు కూడా జరిగితే ఆ బాధ అర్థం అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇలా నెగిటివిటీని ప్రచారం చేస్తారనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసినా.. నా మీద మీమ్స్ చేసి కామెడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Read More: మరో ఉన్నత గౌరవాన్ని సొంతం చేసుకున్న మెగా కోడలు ఉపాసన!

ట్రెండింగ్ వార్తలు