మాజీ భర్తను తిరిగి పొందడం ఎలా.. సంచలనంగా రేణు దేశాయ్ కామెంట్స్!

June 21, 2024

మాజీ భర్తను తిరిగి పొందడం ఎలా.. సంచలనంగా రేణు దేశాయ్ కామెంట్స్!

రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ మాజీ భార్యగా, హీరోయిన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె ప్రస్తుతం పవన్ నుంచి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. ఇలా ఈమె పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఈమెకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో రేణు దేశాయ్ పవన్ అభిమానులకు గొడవ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది పవన్ అభిమానులు ఈమెకు ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. తిరిగి మీరు అన్నయ్య దగ్గరకు వచ్చేసేయండి వదిన అంటూ చాలామంది ఈమెకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాల గురించి ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియో నిజానికి డిసెంబర్లోనే ఎడిట్ చేశాను కానీ షేర్ చేయడం మర్చిపోయాను అంటూ ఈమె ఆ వీడియోని షేర్ చేసారు అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేసిన ఈమె నేను తిరిగి నా మాజీ భర్తను కలవడం ఎలా.. ఆయనను చాలా మిస్ అవుతున్నాను అంటూ చాలామంది తిరిగి ఆయన దగ్గరకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం ఇకనైనా మానుకోండి నాకు ఇలాంటి సలహాలు ఇస్తే నేను వారిని వెంటనే బ్లాక్ చేసేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి తరుణంలో ఆయన పిల్లలు ఇద్దరు కూడా తన వెంటే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఇక మీరు కూడా అన్నయ్య వద్దకు వచ్చేయండి అంటూ ఈమెకు సలహాలు ఇస్తున్నటువంటి తరుణంలో రేణు దేశాయ్ ఇలా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

Read More: ‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ: నాగ్ అశ్విన్

ట్రెండింగ్ వార్తలు