ఏపీ టికెట్ రేట్ల విష‌యంపై స్పందించిన రాంగోపాల్ వ‌ర్మ

December 30, 2021

ఏపీ టికెట్ రేట్ల విష‌యంపై స్పందించిన రాంగోపాల్ వ‌ర్మ

RGV Comments on AP Ticket Pricing: టికెట్ల రేట్ల విష‌యంలో టాలీవుడ్‌లో వేడి మొద‌లైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, నిఖిల్ ఇలా ఒక్కోక్క‌రుగా ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందిస్తున్నారు. తాజాగా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ విష‌యంపై స్పందించారు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువు ఉత్పత్తిదారుకే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడం ఏంటో అర్థంకావడంలేదని తెలిపారు. ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని, అయితే, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ వివరించారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి

Read More: బికినీలో స‌మంత‌..న్యూ ఇయ‌ర్ పార్టీ అక్క‌డేనా..?

ట్రెండింగ్ వార్తలు