రేవ్ పార్టీకి నన్ను పిలిస్తే బాగుండేది.. సంచలనం రేపుతున్న జబర్దస్త్ రీతూ కామెంట్స్!

June 3, 2024

రేవ్ పార్టీకి నన్ను పిలిస్తే బాగుండేది.. సంచలనం రేపుతున్న జబర్దస్త్ రీతూ కామెంట్స్!

ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ ఎలాంటి సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఈ పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారని పోలీసుల వెల్లడించారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని వెల్లడించారు. ఇక ఈ రేవ్ పార్టీలో భాగంగా టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి హేమ కూడా పాల్గొన్నారని పోలీసులు వెల్లడించడమే కాకుండా ఆమెకు నోటీసులు కూడా పంపించారు.

ఇదిలా ఉండగా తాజాగా రేవ్ పార్టీ గురించి జబర్దస్త్ కమెడియన్ రీతు చౌదరి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె సీరియల్స్ తో పాటు సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు అంతేకాకుండా దావత్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా రీతు రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. నాకు ఈ పార్టీ గురించి పెద్దగా ఎలాంటి అవగాహన లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఇదేదో అందరూ కలిసి చేసుకునే పార్టీ అనుకునేదాన్ని అందుకే నన్ను కూడా ఎవరైనా ఈ రేవ్ పార్టీకి పిలిస్తే బాగుండు అని ఎన్నోసార్లు ఫీలయ్యాను కానీ అక్కడ అన్ని చెడు వ్యసనాలు ఉంటాయని డ్రగ్స్ తీసుకుంటారని విషయం తెలిసి వామ్మో ఇలాంటి పార్టీకా నన్ను పిలవాలనుకుంది అంటూ భయపడ్డానని తెలిపారు.

ఈ రేవ్ పార్టీ గురించి నాకు పూర్తిగా అవగాహన లేకపోయినా అక్కడ డ్రగ్స్ వినియోగిస్తారని . అలాంటి పార్టీలకు వెళ్లడం అవసరం లేదని ఫిక్స్ అయ్యా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే మనల్ని మనం సమర్ధించుకోలేము ఒకవేళ సమర్ధించుకున్నా అది పెద్ద తప్పే అవుతుందని తెలిపారు. అసలు సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: క్లిన్ కారా వద్దకు చేరిన ప్రభాస్ బుజ్జి.. ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న మెగా ప్రిన్సెస్!

ట్రెండింగ్ వార్తలు