December 14, 2021
తెలుగులో ప్రముఖ నిర్మాత శిరీష్ (‘దిల్’ రాజు తమ్ముడు) కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రౌడీబాయ్స్’. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ‘దిల్’ రాజు అండ్ కో గట్టిగానే ప్రయత్నించింది. పైగా విజయ్‌దేవరకొండ వంటి స్టార్స్‌తో ప్రమోషన్స్‌ను చేయించింది. కానీ కట్ చేస్తే దసరాకు రౌడీబాయ్స్ రాలేదు. ఆ తర్వాత నవంబరు చివరల్లో రౌడీబాయ్స్ను ధియేటర్స్‌లోకి పంపుదామని ట్రై చేశాడు దిల్ రాజు. మళ్లీ సీన్ రిపీట్. రౌడీబాయ్స్కు దారి దొరకలేదు. అంతే…ఇక అప్పట్నుంచి రౌడీబాయ్స్ కనిపించడం మానేశాడు.
Read more: ఎఫ్ 3..మళ్లీ మళ్లీ వాయిదా!
అసలు..థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తారో వారికే తెలియడం లేదు. పోనీ ఓటీటీనా అను కుంటే…సినిమాలు థియేటర్స్‌లోనే రావాలని పోరాడే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అలాంటిది ఆయనే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే..ఇక అంతే. ఇలా..రౌడీబాయ్స్ దిల్ రాజుకు పెద్ద తలనొప్పిగా మారాడు. ఇక ‘హుషారు’ చిత్రంతో బంపర్‌హిట్ కొట్టిన శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు డైరెక్టర్. అనుపమా పరమేశర్మన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ ఓ కీ రోల్ చేశాడు.