January 3, 2022
PeppyNumberfromRowdyBoys: తెలుగులో ప్రముఖ నిర్మాత శిరీష్ (‘దిల్’ రాజు తమ్ముడు) కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రౌడీబాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ‘దిల్’ రాజు అండ్ కో గట్టిగానే ప్రయత్నించింది. పైగా విజయ్‌దేవరకొండ వంటి స్టార్స్‌తో ప్రమోషన్స్‌ను చేయించింది. కానీ కట్ చేస్తే దసరాకు రౌడీబాయ్స్ రాలేదు. ఆ తర్వాత నవంబరు చివరల్లో రౌడీబాయ్స్‌ను ధియేటర్స్‌లోకి పంపుదామని ట్రై చేశాడు దిల్ రాజు. మళ్లీ సీన్ రిపీట్. రౌడీబాయ్స్‌కు దారి దొరకలేదు. అంతే…ఇక అప్పట్నుంచి రౌడీబాయ్స్ కనిపించడం మానేశారు.
అసలు..థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తారో తెలీని పరిస్థితుల్లో ఇప్పుడు రాజమౌళి పుణ్యమా అని ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల జోరు లేకుండా పోయింది. దాంతో రౌడీబాయ్స్ సంక్రాంతి బరిలోకి దూకింది. ఇక ఎక్కువ సమయంలేకపోవడంతో సగంలో ఆపేసిన ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగా ‘బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే’ అనే పాటను విడుదల చేసింది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలో.. అనుపమ పరమేశ్వరన్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఆమె హావభావాలు కుర్రకారుని కట్టిపడేసేలా ఉన్నాయి. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు.
కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హుశారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. జనవరి రెండవ వారంలో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.