ఆర్‌ఆర్‌ఆర్ లోని కుమురం భీముడో పాట కాపీ ట్యూనా…?

December 28, 2021

ఆర్‌ఆర్‌ఆర్ లోని కుమురం భీముడో పాట కాపీ ట్యూనా…?

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతా రామ రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ న‌టించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం… రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). దాదాపు 14 భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఇటీవ‌ల‌ ‘కొమురం భీముడో.. కొమురం భీముడో..అంటే సాగే పాట విడుద‌లై శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టు కుంటుంది. గోండు బెబ్బులి కొమురం భీమ్‌ ధైర్యసాహసాలను చాటిచెప్తూ అద్భుతమైన లిరిక్స్‌ అందించాడు సుద్దాల అశోక్‌ తేజ. ఎం ఎం కీర‌వాణి కుమారుడు సింగర్‌ కాలభైరవ గాత్రంతో ఈ పాట మరో లెవల్‌కు వెళ్లిపోయింది. ‘కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో..’అంటూ సాగే ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకోవ‌డం ఖాయం.

అయితే ఈ పాట తెలంగాణ జాన‌ప‌థం `మ‌ద‌నా సుందారి`కీ కాపీ ట్యూన్ అనే విమ‌ర్ష‌లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మ‌ద‌నా సుందారి మ‌ద‌నా సుందారి… నా మామ కొడుకొచ్చే మంచము చేయ‌వోయి వ‌డ్లోళ్ల చారి… అంటూ సాగే తెలంగాణ జాన‌ప‌థానికి ఇది కాపీ ట్యూన్ అంటూ సోష‌ల్‌ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇదే ట్యూన్‌తో 1983లో వ‌చ్చిన రంగుల క‌ళ సినిమాలో గ‌ద్ద‌ర్ ఒక పాడారు. `మ‌ద‌నా సుందారి మ‌ద‌నా సుంద‌రి సందేడు కురులాది జ‌మిలీ పాప‌డ‌దో మ‌దనా సుందారి..మ‌ద‌నా సుందారి మ‌ద‌నా సుంద‌రి బొమ్మ‌ల్లా మెరిసేటి నీ బొట్టు జూశో..మ‌ద‌నా సుంద‌రి` అంటూ ఆ పాట సాగుతుంది. వీటితో పాటు ఈ పాట‌లో ఎం ఎం కీర‌వాణి కుమారుడు సింగర్‌ కాలభైరవను ఒక స్టార్ హీరో రేంజ్‌లో ప్రొజెక్ట్ చేయ‌డం కూడా అభిమానులకు న‌చ్చలేదు. దాంతో ఈ పాట ప్రొజెక్ట్ చేసిన విధానంపై కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు