October 27, 2021
గత కొంత కాలంగా మెగా అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ ఇప్పుడెలా వుంది? హాస్పటల్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా సాయి ధరమ్ ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? ఆయన ముఖానికి ఏమైన గాయాలయ్యాయా? ఇలాంటి సందేహాలన్నింటికి సమాధానం దొరికింది.
ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాడని తెలిసిన తర్వాత మెగాస్టార్, పవర్ స్టార్ ట్వీట్ లు వేయడం తప్ప మరో అప్ డేట్ లేదు. రీసెంట్‌గా హరీష్ శంకర్ సాయిని పరామర్శించి చేతిలో చెయ్యి వేసిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఫ్యాన్స్ మొహం చూపించండి అంటూ భారీగా కామెంట్లు చేశారు.
సాయి ధరమ్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఏమిటంటే ఆయన దాదాపుగా కోలుకున్నారు. లేచి కూర్చుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన ఫిజిక్ మాత్రం బాగా తగ్గిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎంత సన్నగా వుండేవారో అంత సన్నంగా చూసేవారు ఆశ్చర్యపోయేలా అయిపోయారు.
మొహం మీద ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయితే కొన్నాళ్ల పాటు షాక్ లో వుండడం వల్ల మాట కాస్త తడబడుతోందని తెలుస్తోంది. అది కూడా ఓ వారంలో సెట్ అయిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సెలక్టివ్ గా రోజుకు లేదా రెండు రోజులకు ఒకర్ని మాత్రమే కలుస్తున్నారు. అది కూడా సాయంత్రం వేళల్లో. పగలంతా విశ్రాంతిగా తీసుకుంటున్నారు.