అల్లు అర్జున్ జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు?

June 12, 2024

అల్లు అర్జున్ జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు?

మెగా అల్లు కుటుంబాల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వాటిని కప్పి పెడుతూ వచ్చారు. కానీ ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని తెలుస్తుంది. మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడికి మద్దతు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపును కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు కానీ ఈయన మాత్రం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలియజేస్తున్న నంద్యాల వెళ్లారు. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇక అల్లు అర్జున్ మద్దతు తెలిపిన శిల్పా రవి ఘోరంగా ఓటమి పాలయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు.

ఇలా పవన్ కళ్యాణ్ గెలవడంతో మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఈ సంబరాలకు అల్లు ఫ్యామిలీ దూరంగా ఉన్నారు. ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. కానీ అల్లు కుటుంబ సభ్యులు మాత్రం హాజరు కాలేదు. అంతేకాకుండా తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ తో పాటు తన భార్య స్నేహారెడ్డిని కూడా అన్ ఫాలో చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. సాయి ధరమ్ తేజ్ కేవలం అల్లు శిరీష్ ను మాత్రమే ఫాలో అవటం విశేషం ఇక సాయిధరమ్ కాకుండా మిగతా హీరోలు అందరూ కూడా ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారు కానీ ఈయన మాత్రం అన్ ఫాలో కావడంతో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

Read More: తన డిజాస్టర్ సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. గర్వంగా ఉందంటూ?

ట్రెండింగ్ వార్తలు