ఆ కారణంతోనే పొట్టి బట్టలు వేసుకోను..సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

July 9, 2024

ఆ కారణంతోనే పొట్టి బట్టలు వేసుకోను..సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Sai Pallavi Interesting Comments On Her Dressing Style: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఎంతో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకోవడమే కాకుండా ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తారు.

ఇక సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా ఎంతో నిండుగా దుస్తులు ధరించి అందరికీ చాలా స్ఫూర్తిగా ఉంటారు. అయితే సాయి పల్లవి సినిమాలలో కూడా మోడరన్ దుస్తులు ధరించిన పొట్టి పొట్టి దుస్తులను అసలు ధరించరు. నిండు ఉండే దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇలా ఈమె పొట్టి దుస్తులను ఎందుకు ధరించరు అసలు ఏం జరిగింది అనే విషయం గురించి ఒక సందర్భంలో ఈమె వెల్లడించారు.

ఈ సందర్భంగా సాయిపల్లవి ఎప్పుడు నిండు దుస్తులు వేయడానికి పొట్టి బట్టలకు దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు. నేను జార్జియాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు నేను టాంగో నేర్చుకున్నాను. ఇందుకోసం నేను పొట్టి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకున్నాను. దీనికి వారు ఓకే చెప్పారు. ఆ తర్వాత నేను నటించిన ప్రేమమ్‌ విడుదలైంది. నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నా టాంగో డ్రెస్ వైరల్ అయింది.

ఈ సమయంలో ప్రజలు నా దుస్తులపై కామెంట్స్ చేశారు. నేను చాలా అసౌకర్యంగా భావించాను,అని తెలిపింది. ఆ సంఘటన తర్వాత నేను సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను.ఒక పని చేసి మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. బట్టలను బట్టి మనిషిని అంచనా వేయడం సరికాదు. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని చూపించవంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా పోటీ దోస్తులు వేసుకోకపోవడానికి గల కారణాలను తెలుపుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

ట్రెండింగ్ వార్తలు