ఖరీదైన కారును కొనుగోలు చేసిన హీరో పృథ్వీ రాజ్.. ధర ఎంత అంటే?

June 29, 2024

ఖరీదైన కారును కొనుగోలు చేసిన హీరో పృథ్వీ రాజ్.. ధర ఎంత అంటే?

మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇన్ని రోజులు మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతో సక్సెస్ అందుకున్న ఈయన ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో వరదరాజమన్నార్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ పాత్రలో పృథ్వీ రాజ్ తప్ప మరెవరు సెట్ కారు అనే విధంగా ఈయన నటన ఉందని చెప్పాలి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతగా అయితే కష్టపడ్డారో అదే స్థాయిలో పృథ్వీ రాజ్.. కూడా కష్టపడ్డారని చెప్పాలి. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన మలయాళంలో నటించిన సినిమాలను కూడా ప్రస్తుతం తెలుగులో విడుదల చేస్తూ ఉన్నారు.

ఇలా తెలుగు మలయాళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పృథ్వీ రాజ్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పృథ్వీ రాజ్ కొనుగోలు చేసిన కారు ఏది దాని ఖరీదు ఎంత అనే విషయంపై అభిమానులు ఆరాతీస్తున్నారు.

తాజాగా 911 GT3 పోర్షే కారును కొనుగోలు చేయగా ఈ కారు ఎక్కువ పనితీరు ఉన్న హోమోలోగేషన్ మోడల్ కారు కావడం గమనార్హం. ఈ కారు 375 కిలోవాట్ల పనితీరును కలిగి ఉందని తెలుస్తోంది. ఈ కారు 6 స్పీడ్ జీటీ స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉందని భోగట్టా. ఈ కారు ఖరీదు 3 కోట్ల రూపాయలు అని సమాచారం. ఇలా ఈ కారు ధర మూడు కోట్ల రూపాయలు అనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈయన సలార్ 2 తో పాటు ఇతర మలయాళీ సినిమా షూటింగ్ పనులను బిజీగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు