ఆ సీక్వెల్‌లో 10 మంది హీరోయిన్లు

January 7, 2022

ఆ సీక్వెల్‌లో 10 మంది హీరోయిన్లు

SALMANKHAN కెరీర్‌లో ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలే చేశారు. కానీ 2005లో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్, ఫర్దీన్‌ కాన్‌ ప్రధాన తారాగణంగా అనీజ్‌ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నో ఎంట్రీ’. ఈ సినిమా సల్మాన్‌లోని కామెడీ యాంగిల్‌ను బయటపెట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ను తెరకెక్కించనున్నట్లు సల్మాన్‌ఖాన్‌ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్, ఫర్దీన్‌ఖాన్‌ ట్రిపుల్‌ రోల్స్‌ చేస్తారని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. కథ రిత్యా ‘నో ఎంట్రీ 2’ అనేది మూడు తరాలకు చెందినదట. అందుకనే సల్మాన్, అనిల్‌ కపూర్, ఫర్దీన్‌ ఖాన్‌ ట్రిపుల్‌ రోల్స్‌ చేస్తున్నారట. అంతేకాదు.. నో ఎంట్రీ సినిమాలో పదిమంది హీరోయిన్స్‌ ఉంటారట. మరి..ఈ పదిమంది హీరోయిన్స్‌ ఎవరూ అనేది తెలియాలంటే మాత్రం కొంతసమయం వేచి ఉండక తప్పదు.

కోవిడ్‌ భయంతో వెనక్కి తగ్గిన సల్మాన్‌ఖాన్‌

ట్రెండింగ్ వార్తలు