చైతన్యకు పదికి పది మార్కులు ఇచ్చిన సమంత!

June 26, 2024

చైతన్యకు పదికి పది మార్కులు ఇచ్చిన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సమంత ఈమె ఏ మాయ చేసావే సినిమా ద్వారా నాగచైతన్యతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది నాగచైతన్యకు రెండో సినిమా అయినప్పటికీ సమంతకు మాత్రం మొదటి సినిమా అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత సమంతకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఎంతో మంచి చనువు ఏర్పడింది ఈ చనువు కాస్త ప్రేమగా మారి పెళ్లికూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన సమంత నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరు విడిగా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టి వర్సెస్ సినిమాలలో నటిస్తున్నారు కానీ గతంలో సమంత నాగచైతన్య గురించి నాగచైతన్య సమంత గురించి చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో సమంత నాగచైతన్య గురించి మాట్లాడటమే కాకుండా ఓ విషయంలో సమంత నాగచైతన్యకు ఇచ్చిన రేటింగ్ బట్టి చూస్తే వీరిద్దరి మధ్య అప్పట్లో ఎంత ప్రేమ ఉండేదో తెలుస్తుంది.

నాగచైతన్య చాలా రొమాంటిక్ అని తాను అంత రొమాంటిక్ పర్సన్ కాదని తెలిపారు. రొమాన్స్ విషయంలో నాగచైతన్యకు పదికి పది మార్కులు వేయచ్చని తెలిపారు. ఇక లుక్స్ పరంగా కూడా పలువురు హీరోల గురించి మాట్లాడుతూ ఈమె రేటింగ్ ఇచ్చారు మహేష్ బాబుకి లుక్స్ పరంగా 10 రేటింగ్ ఇవ్వగా, ఎన్టీఆర్ కి 9.5 రేటింగ్ ఇచ్చారు. ఇక హృతిక్ రోషన్ తనకు నచ్చరని రణబీర్ కపూర్ 8 రేటింగ్ ఇచ్చారు. ఇక లుక్స్ విషయంలో చైతన్య గురించి మరో ఆలోచన లేదని ఆయనకు పదికి పది రేటింగ్ అంటూ అప్పట్లో ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read MoreSamantha Ruth Prabhu: ఈ స్థాయికి రావడానికి అంతలా కష్టపడిందా?

ట్రెండింగ్ వార్తలు