August 14, 2024
ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు నాగచైతన్య. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు. చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో అందరి దృష్టి సమంతపై పడింది. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.
కానీ తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె డేటింగ్ గురించి వరుస కథనాలు వెలుబడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే రెడ్ ఇట్ అనే నేషనల్ మీడియా కథనం ప్రకారం సమంత మరోసారి ప్రేమలో పడిందని తెలుస్తోంది. తను ఎవరో కాదు సమంతతో కలిసి ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు. ఈ సిరీస్ సమయంలోనే సమంత విడాకులు తీసుకుంది.. అంతే కాకుండా అతని డైరెక్షన్‌లో సిటాడెల్.. హనీ బన్నీ అనే మరో వెబ్ సిరీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. అతనితో సామ్ డేటింగ్ చేస్తుందని వస్తోన్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.
2017లో సమంత-నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాచు..ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. సమంత సిటాడెల్.. హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉండగా నాగచైతన్య తండేల్ మూవీతో మన ముందుకు రానున్నారు.