December 7, 2021
సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది సమంత. ఇటీవల విడాకుల తర్వాత కొంచెం డల్ అయింది. తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన ఫీలింగ్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన సినిమా అప్డేట్లతో పాటు విడాకుల తర్వాత తన తన మనసులోని భావాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కాని నేను మానసికంగా ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలను అని అనుకోలేదు‘ అని ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది.
Read More: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్సినిమాల విషయంలో ఇటీవల కాస్త వెనకపడ్డ సమంత ప్రస్తుతం జోరు పెంచింది. శాకుంతలం షూటింగ్ పూర్తిచేసింది. శ్రీదేవి మూవీస్‌లో యశోద అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాకు హరి – హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యిందని సమాచారం. అలాగే యశ్ రాజ్ ఫిలింస్ లో ఓ హిందీ సినిమా, ఫిలిప్ జాన్ దర్శకత్వంలో హాలీవుడ్ సినిమా చేయనుంది. వీటితో పాటు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమా కూడా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. ఇలా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఫుల్ బిజీ కానుంది సమంత..వీటితో పాటు రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. త్వరలోనే ఆ పాట విడుదలకాబోతుంది.