December 28, 2021
ఇటీవల కాలంలో హీరోయిన్ సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. విడాకుల విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి వార్తల్లోకి రాగా ఇప్పుడు బికినీలో ఫ్రెండ్స్ తో ఫోటోలు దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. సాదారణంగానే డ్రస్సింగ్ స్టైల్ విషయంలో సమంత రూటే సపరేటు.. సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ మేరకు మోడ్రన్ డ్రస్‌లు వేసుకున్నా ప్రచార కార్యక్రమాల్లో సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తుంది. అప్పుడప్పుడు స్నేహితులు లేదా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేసినప్పుడు బికినీల్లో సందడి చేస్తారు. గతంలో మాల్దీవులు వెళ్లినప్పుడు బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. లేటెస్టుగా మరోసారి బికినీ లాంటి మోనోకినీ ధరించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సమంత షేర్ చేశారు. అందులో ఆమెతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ స్టయిలిస్ట్ శిల్పా రెడ్డి, మోడల్ అండ్ ఎంట్రప్రెన్యూర్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ గోవాలో విహరిస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్టు సమాచారం.