ఆ పాట చేయొద్దని ఒత్తిడి తెచ్చారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

June 7, 2024

ఆ పాట చేయొద్దని ఒత్తిడి తెచ్చారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ఇచ్చారు. అయితే త్వరలోనే తిరిగి మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు ఈమె ఇతర సినిమా కథలను కూడా వినే పనులలో బిజీగా ఉన్నారు.

మయోసైటిసిస్ కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే ఈ సమస్య నుంచి కోలుకోవడంతో తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఊ అంటావా మామ అనే పాటలో సమంత చేసిన డాన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కొంతవరకు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా తన గురించి అప్పట్లో పలువురు భారీ స్థాయిలో విమర్శలు చేశారు.

తాజాగా ఈ పాట గురించి సమంత మాట్లాడుతూ తాను విడాకులు తీసుకోవాలి అనుకున్న సమయంలో ఈ పాటలో చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే ఈ పాటలు చేయొద్దు అని నా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి సమయంలో ఇలాంటి పాట చేస్తే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ నేను మాత్రం వారి మాట వినలేదు నేను ఏ తప్పు చేయలేదు నా వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి తప్పు లేకుండా నిజాయితీగా బతికాను. అలాంటప్పుడు ఎవరికి నేను భయపడాలి అని ధైర్యం చేసి ఈ పాట చేశాను అంటూ మరోసారి సమంత ఈ పాట గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మెగా సంబరాలలో కనిపించని అల్లు ఫ్యామిలీ… ఆ మనస్పర్ధలే కారణమా?

ట్రెండింగ్ వార్తలు