సినిమాలు లేకపోయిన.. ఐఎండీబీ జాబితాలో మరో రికార్డు సొంతం చేసుకున్న సమంత?

June 5, 2024

సినిమాలు లేకపోయిన.. ఐఎండీబీ జాబితాలో మరో రికార్డు సొంతం చేసుకున్న సమంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత. ఈమె కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం హిందీ భాష సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సమంత కాస్త సినిమాలకు విరామం ప్రకటించారు. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు.

ప్రస్తుతం సమంత ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే ఈమె సినిమాలలోకి రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయినటువంటి సమంత ఆ సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక సమంత సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులతో ముచ్చటిస్తూ సందడి చేసేవారు. ఇప్పటికే పలుకు మీడియా సర్వేలలో భాగంగా అత్యంత ఆదరణ పొందిన నటిగా సమంత పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే తాజాగా ఐఎండీబీ జాబితాలో కూడా సమంత అరుదైన చోటు సొంతం చేసుకున్నారు. తాజాగా వెల్లడించినటువంటి ఈ ఐఎండీబీ జాబితాలో ఈమె 13వ స్థానంలో చోటు సంపాదించుకోవడం విశేషం. సౌత్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి వారిలో సమంత 13వ స్థానంలో నిలవడంతో ఈ విషయంపై ఈ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది నా కష్టానికి దక్కిన ప్రతిఫలం అని తెలిపారు. నేను ఇండస్ట్రీలోకి ఇప్పుడే వచ్చాననే భావనలో ఉంది కానీ ఇన్నేళ్లు ఎలా ప్రయాణం చేశానో తెలియడం లేదని తెలిపారు. ఇప్పుడిప్పుడే నాకు గొప్ప సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరింత కష్టపడి సినిమాలలో పని చేస్తానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. ఇక ఈ జాబితాలో దీపిక పదుకొనే మొదటి స్థానంలో ఉండగా 16వ స్థానంలో తమన్నా 18వ స్థానంలో నయనతార ఉండటం విశేషం.

Read More: ఆర్య సినిమా కోసం సూపర్ హిట్ మూవీని వదులుకున్న బన్నీ.. హిట్ కొట్టిన రవితేజ?

ట్రెండింగ్ వార్తలు