పోటీ ఉంటేనే ప్రతిభ మెరుగుపడుతుంది.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

June 6, 2024

పోటీ ఉంటేనే ప్రతిభ మెరుగుపడుతుంది.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

సినీనటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా సినిమాలకు దూరమైన ఈమె త్వరలోనే మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా సమంత నిర్మాణ సంస్థలోనే ప్రేక్షకుల ముందుకు రావటం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇలా సమంత ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో తన సినిమాలపై దృష్టి సారించారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా సమంత గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఐఎండీబీ జాబితాలో కూడా 13వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ జాబితాలో మరో అరుదైన ఘనత సాధించడంతో ఈమె ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి… ప్రతి ఒక్క రంగంలోనూ పోటీ అనేది తప్పకుండా ఉంటుందని తెలిపారు. అయితే నేను నా సహా నటీనటుల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని వెల్లడించారు.

నేను కూడా వారందరి ఇలా మరింత కష్టపడాలని భావిస్తాను ఎప్పుడైతే మనకు పోటీ తత్వం ఉంటుందో అప్పుడే మనలో ఉన్న సృజనాత్మకత కూడా బయటకు వస్తుందని తెలిపారు. ఎప్పుడైతే పోటీ ఉంటుందో అప్పుడే మన ప్రతిభ కూడా మెరుగుపడుతుందనీ సమంత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమెకు ఇతర సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇక సమంత చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Read More: ఆచార్య సినిమాలో తన పాత్ర తొలగింపు పై కాజల్ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు