Samantha Ruth Prabhu: శకుంతలగా సమంత

February 21, 2022

Samantha Ruth Prabhu: శకుంతలగా సమంత

కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ శాకుంతలం అనే మైథలాజికల్‌ ఫిల్మ్‌ చేశారు సమంత(Samantha Ruth Prabhu). దుష్యంత మహారాజు, శాకుంతలల అద్భుతప్రేమకావ్యం ఆధారంగా శాకుంతలం చిత్రం తెరకెక్కకుతోంది. గుణశేఖర్‌ ఈ సినిమాకు దర్శకుడు. శాకుంతలం చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ యాక్టర్‌ దేవ్‌మోహన్ నటించారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అనసూయ, గౌతమి, మోహన్‌బాబు కనిపిస్తారు. తాజాగాశాకుంతలం చిత్రంలోని సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్, గుణశేఖర్‌ టీమ్ వర్క్స్‌ పతాకాలపై దిల్‌ రాజు, నీలిమ గుణ నిర్మించారు. శాకుంతలం చిత్రం వేసవిలో విడుదల కానుంది.

శాకుంతలం సినిమా కాకుండా సమంత చేతిలో యశోద ,కాదు వాక్కుల రెండు కాదల్ చిత్రాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. అలాగే శాంతరుబన్‌ జ్ఞానశేఖర్ డైరెక్షన్‌లో డ్రీమ్‌వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సమంత ఓ సినిమా కమిటైయ్యారు. ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌కావాల్సి ఉంది.

Readmore Nikhil Siddhartha: లైవ్ వెప‌న్ ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ హీరో
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Shakuntalam first look released

ట్రెండింగ్ వార్తలు