Samantha: సావిత్రిలా నా జీవితం కాకూడదు..అందుకే దూరమయ్యాను

July 10, 2024

Samantha: సావిత్రిలా నా జీవితం కాకూడదు..అందుకే దూరమయ్యాను

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత మూడు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్న వీరిద్దరూ అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. కానీ సరైన కారణమేంటి అనేది మాత్రం తెలియదు. వీరి విడాకుల గురించి ఎన్నో రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సమంత ఒంటరిగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసిన పలు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రేమలో నేను కూడా మోసపోయాను అయితే తృటిలో తప్పించుకున్నాను. లేకపోతే నా జీవితం కూడా సావిత్రిగారి లాగా అయ్యదని తెలిపారు. సావిత్రి గారి గురించి నాకు తెలియదు కానీ మహానటి సినిమా సమయంలో ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నానని తెలిపారు.

సావిత్రి జెమినీ గణేషన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఆయనకు ఇదివరకే వేరే అమ్మాయితో పెళ్లి జరిగి ఉంటుంది. ఆ విషయం తెలిసిన ఈమె ఎంతో మానసిక క్షోభ అనుభవించి మందుకు బానిసయ్యి మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన జీవితాన్ని కూడా సావిత్రి జీవితంతో పోల్చుకొని కామెంట్లు చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు