December 15, 2021
స్టార్ హీరోయిన్‌గా యాభై సినిమాలు చేసిన సమంత కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నారు అనగానే ఈ పాటకు ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారో అని ఫిల్మ్‌ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. కానీ ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటవా మావ..ఊఊ అంటవా’ పాటకు సమంత తీసుకున్న పారితోషికం అక్షరాల కోటి ఇరవై లక్షలు అని ఫిల్మ్‌నగర్ ఇన్‌సైడ్ టాక్. స్పెషల్‌సాంగ్ చేసే ఏ హీరోయిన్ ఇంత చార్జ్ చేయరు. పైగా కోటి రూపాయల పారితోషికం కన్నా తక్కువతోనే సినిమా మొత్తం యాక్ట్ చేసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయినా పుష్ప టీమ్ సమంతవైపే మొగ్గు చూపింది. బహుశా..ది ఫ్యామిలీమ్యాన్ 2తో సమంత సంపాదించిన క్రేజ్ కొంత బాలీవుడ్‌లో పుష్పకు ఉపయోగపడవచ్చని టీమ్ భావించి ఉండొచ్చు. ఒక సినిమాకు దాదాపు మూడు కోట్ల పారితోషికం తీసుకునే సమంత..నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసే స్పెషల్ సాంగ్ కోసం కోటి 20 లక్షలు వస్తున్నప్పుడు స్పెషల్‌గా ఊ అనడం కరెక్టెనేమో కదా!
ఇప్పటికే తెలుగులో మూడు కోట్లకు పైగా వీక్షణలు అందుకున్న ఊ అంటావా పాటను మీరు చూసెయ్యండి