ఎన్టీఆర్- కొర‌టాల శివ సినిమాలో హీరోయిన్‌గా సామ్‌..

December 27, 2021

ఎన్టీఆర్- కొర‌టాల శివ సినిమాలో హీరోయిన్‌గా సామ్‌..
Samantha To Play Female Lead In NTR Koratala Siva Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమా రూపొందనున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. దాంతో సెంటిమెంట్ గా మరోసారి ఈ కాంబినేషన్‌ను రిపీట్‌ చేయనున్నాడ‌ట కొర‌టాల‌. ప్ర‌స్తుతం కొర‌టాల తెర‌కెక్కిస్తున్న ఆచార్య సినిమా ప‌నులు పూర్తికాగానే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‌ లీడర్‌, యంగ్ పొలిటీష‌న్ గా క‌నిపించ‌నున్నాడు. మంచి పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని కొర‌టాల శివ రూపొందించ‌నున్నాడు.Read More: త‌మ‌న్ ఆర్ ఆర్ కి ప్ర‌భాస్ ఫిదా..!

ట్రెండింగ్ వార్తలు