సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్న పుష్ప సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా మావా ఊహూ అంటావా..

December 10, 2021

సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్న పుష్ప సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా మావా ఊహూ అంటావా..

సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం…రింగ రింగా…డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇప్పుడు సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న పుష్ప సినిమా నుండి మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంతతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు. ఊ అంటావా మావా ఊహూ అంటావా అంటూ వచ్చిన ఈ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

దేవి మార్క్ మాస్ బీట్ తో సందర్భానికి తగినట్టుగా ఆడియెన్స్ కు మాస్ జాతర ఇచ్చేలా ఈ సాంగ్ ఉంది. విజువ‌ల్స్ అయితే చూపించ‌లేదు కాని సమంత హాట్ లుక్స్ సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు. డెఫినెట్ గా పుష్ప లో సమంత ఊ అంటావా మావా సాంగ్ ఓ రేంజ్ లో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్ప‌టికే ఈ పాట 2మిలియ‌న్ల వ్యూస్ క్రాస్ చేసి సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.

డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు