May 20, 2022
Sanjana Galrani: ప్రభాస్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి పలు సినిమాల్లో నటించింది కానీ అవి ఆమెకు విజయాలను కట్టబెట్టలేకపోయాయి. దీంతో కన్నడలోనే పలు సినిమాల్లో నటించింది. అక్కడ కూడా ఈమె రాణించింది అంతంత మాత్రమే. ఇదిలా ఉండగా.. అజీజ్ బాషా అనే వ్యక్తిని ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతని కోసం ఈమె ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించిన సంగతి కూడా తెలిసిందే.తర్వాత ఈమె గర్భం దాల్చడం కూడా జరిగింది.
ఇటీవల ఈమె సీమంతం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ రోజు సంజన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సంజన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు స్నేహితులు ఈమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే సంజనా సోదరి నిక్కీ గల్రానీ వివాహం నటుడు ఆది పినిశెట్టితో అదే రోజున చెన్నైలో జరిగడం. ఒకే రోజున చెల్లెలి పెళ్లి, అక్కకి డెలివరీ అవ్వడంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.