SaripodhaaSanivaaram: నాని శివ‌తాండ‌వం..ఈ వీకెండ్ అదిరిపోనుంది!

August 14, 2024

SaripodhaaSanivaaram: నాని శివ‌తాండ‌వం..ఈ వీకెండ్ అదిరిపోనుంది!

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య మంచి జోరుమీదున్నారు. అటు ద‌స‌రా ఇటు హాయ్ నాన్న‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించారు. ప్ర‌స్తుతం నాని, వ‌ర్సటైల్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ `స‌రిపోదా శ‌నివారం`.. డిఫ‌రెంట్ టైటిల్ ఈ సినిమా గురించి ప్రేక్ష‌కులు ఆలోచించేలా చేసింది. అలాగే న‌ట రాక్ష‌సుడిగా అద‌ర‌గొడుతున్న డైరెక్ట‌ర్ ట‌ర్న్‌డ్ యాక్ట‌ర్ ఎస్ జే సూర్య మ‌రోసారి త‌న విల‌నిజంతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ ద‌క్కించుకోగా తాజాగా సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. త‌న అమ్మ చెప్పిన‌ట్టుగా వారం రోజులు త‌న‌కు వ‌చ్చే కోపాన్ని ఒక పేప‌ర్‌పై రాసుకుని ఒక్క శ‌నివారం మాత్ర‌మే దాన్ని తీర్చుకునే పాత్ర‌లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు నాని. అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక‌ సోకుల‌పాలెం అనే గ్రామం ప‌ట్ల వివ‌క్ష పెంచుకుని ఆ ఊరి జ‌నాల్ని చీటికి మాటికి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు చేసే సీఐ ద‌యానంద్ పాత్ర‌లో ఎస్ జే సూర్య కూడా అద‌ర‌గొట్టార‌నే చెప్పాలి. వీరిద్దరి క్యారెక్ట‌రైజేష‌న్స్ సినిమాకు మెయిన్ అసెట్‌. మిగ‌తా పాత్ర‌ల‌కి ట్రైల‌ర్‌లో అంత ప్రాధాన్య‌త లేదు..మురళి జి సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఆకట్టుకున్నాయి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్స్‌. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం.. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు,

SJ సూర్య మాట్లాడుతూ.. మీ అందరిని కలవడం ఆనందంగా ఉంది. ట్రైలర్ కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్ తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ ఉన్న‌ సినిమా ఇది. మంచి ఎనర్జీ ఉన్న‌ సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు