అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే  పాట విడుదల

March 27, 2023

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే  పాట విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు అద్భుతమమైన సొగసుని తీసుకొచ్చాయి. సంజిత హెగ్డే, పద్మలత, హిప్ హాప్ కలసి ఈ పాటని చాలా శ్రావ్యంగా అలపించారు.

అఖిల్ ఈ పాటలో కూల్ అండ్ స్టైలిష్‌ గా కనిపించారు. అఖిల్, సాక్షి వైద్య ల కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. అందమైన ఫారిన్ లొకేల్స్‌లో రూపొందించిన పాట విజువల్ వండర్ లా వుంది.

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్,  క్యారెక్టర్‌ లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతుంది.

ట్రెండింగ్ వార్తలు