April 10, 2023
అల్లరి నరేష్, విజయ్ కనకమేడల రెండవ సారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఉగ్రం’ కోసం జతకట్టారు. టీజర్‌లో ఉగ్రం ఇంటెన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండనుందని ప్రజంట్ చేయగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని పాటల ద్వారా తెలుస్తోంది.
మొదటి పాట దేవేరి బ్లాక్‌బస్టర్ కాగ, ఉగ్రం సెకండ్ సింగిల్ ఇప్పుడు విడుదలైంది. అల్బెలా అల్బెలా పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల పెప్పీ బీట్స్‌తో ప్లజంట్ సాంగ్ ని అందించారు. కుటుంబంతో గడపడం ఎంత ముఖ్యమో ఈ పాట చెబుతుంది.
పోలీసు పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన భార్య మిర్నా, కూతురితో హాయిగా గడపడానికి పని నుండి బ్రేక్ తీసుకున్నారు. ఈ విషయాన్ని భాస్కరభట్ల పాట ద్వారా తెలియజేశారు. రేవంత్, శ్రావణ భార్గవి బ్యూటీఫుల్ గా ఆలాపించారు. విజువల్స్ మరింత ఆహ్లాదకరంగా ఉన్నాయి. మనం కూడా విశ్రాంతి తీసుకొని కుటుంబంతో గడిపిన అనుభూతిని పొందుతాము. ఇది మరో చార్ట్‌బస్టర్ కానుంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.
సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
వేసవి కానుకగా మే 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల కానుంది.