July 24, 2024
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటివారం లేదంటే ఆగస్టు చివరి వారంలోని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు హీరోలు కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత సీజన్లో సీనియర్ హీరో శివాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతగానో ఉపయోగపడిందనే సంగతి తెలిసిందే.
ఇకపోతే ఎనిమిదవ సీజన్లో కూడా ఒక సీనియర్ హీరో పాల్గొనబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఇటీవల రాజధాని ఫైల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సీనియర్ హీరో వినోద్ కుమార్. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త అవకాశాలను అందుకోవడం కోసం బిగ్ బాస్ సరైన ఎంపిక అని భావించిన ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారట.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో సీనియర్ హీరో వినోద్ పాల్గొనబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా వివాదాలలో నిలిచిన వారిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి పంపించడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
ఇలా వివాదాల ద్వారా వార్తలలో నిలిచిన సెలబ్రిటీల హౌస్ లోకి వెళ్తే సరికొత్త వివాదాలతో మంచి కంటెంట్ ఇవ్వగలరనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరి ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ లో ఎవరు ఉన్నారు ఏంటి అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి