ఖరీదైన బెంజ్ కార్ కొనుగోలు చేసిన బుల్లితెర నటి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

July 8, 2024

ఖరీదైన బెంజ్ కార్ కొనుగోలు చేసిన బుల్లితెర నటి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర నటిగా ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె వివిధ ఛానల్ లో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సీరియల్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లహరి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు.

ఇక ఈమె చివరిగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో నటించారు. అయితే ప్రస్తుతం ఎలాంటి సీరియల్స్ అలాగే కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా కేవలం ఇంటిపట్టునే ఉంటున్నారు. అయితే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి సీరియల్స్ కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం బాబు ఉండటంతో తన ఆలనా పాలన చూసుకుంటూ ఇంటిపట్టునే ఉన్నారు.

ఇలా ఈమె సీరియల్స్ కి దూరంగా ఉన్నప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే లహరి తాజాగా కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈమె ఇటీవల కొత్త బెంజ్ కార్ కొనుగోలు చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. తన తల్లిదండ్రులతో పాటు తన భర్త కొడుకుతో కలిసి ఈమె కొత్త కారుతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక లహరి బెంజ్ కార్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లహరి కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంత అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈమె కొనుగోలు చేసిన ఈ బెంజ్ కారు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఇలా 80 లక్షల విలువచేసే కారు కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

ట్రెండింగ్ వార్తలు