ఐపీఎల్ ఫైనల్ లో షారుఖ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

May 28, 2024

ఐపీఎల్ ఫైనల్ లో షారుఖ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గురించి పరత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ ఈ ఏడాది మాత్రం ఇంకా కొత్త సినిమాలను ప్రకటించలేదు అయితే ఈయన ప్రస్తుతం ఐపీఎల్ హడావిడిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇంకా ఇటీవల చెన్నైలో జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ లో షారుక్ ఖాన్ టీమ్ గెలవడంతో షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరిగింది అయితే ఈ మ్యాచ్ చూడటం కోసం స్టేడియంలో షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇక ఈ మ్యాచ్లో భాగంగా షారుక్ టీం గెలవడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియం మొత్తం సంబరాలు చేశారు అయితే ఈ మ్యాచ్ సందర్భంగా షారుఖ్ ఖాన్ చేతికి ఉన్నటువంటి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది దీనితో షారుక్ కట్టినటువంటి ఈ వాచ్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక ఫైనల్ మ్యాచ్లో భాగంగా షారుఖ్ ఖాన్ ధరించినటువంటి ఈ వాచ్ రీచర్డ్ మిల్లె కంపెనీకి చెందినటువంటి స్కల్ టైటానియం వాచ్ ధరించారు. ఈ వాచ్ ఖరీదు అక్షరాల 4 కోట్ల రూపాయలు కావటం విశేషం. ఇలా ఈ వాచ్ ఖరీదు నాలుగు కోట్లు అనే విషయం తెలియడంతో ఒకసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

షారుక్ ఖాన్ 4 కోట్ల వాచ్ అమ్మితే చాలు మన జీవితం మొత్తం హ్యాపీగా గడపవచ్చు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు దట్ ఇస్ కింగ్ ఖాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలు ఇలా బ్రాండెడ్ ఖరీదైన వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం. నిజానికి సేలబ్రిటీలు వేసుకొని షూ నుంచి మొదలుకొని ఉండే ఇల్లు తిరిగే కార్లు వరకు కూడా చాలా ఖరీదైనవే ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.

Read More: Rashmika Mandanna: బేబీ డైరెక్టర్‌తో ఆ పాత్రలో నటించాలని ఉంది

Related News

ట్రెండింగ్ వార్తలు