Shakunthalam First Look: స‌మంత‌ని దేవ‌క‌న్య‌లా చూపిస్తార‌నుకుంటే య‌క్షిణిలా చూపించారు

February 22, 2022

Shakunthalam First Look: స‌మంత‌ని దేవ‌క‌న్య‌లా చూపిస్తార‌నుకుంటే య‌క్షిణిలా చూపించారు

గుణ‌శేఖ‌ర్…కెరీర్‌లో హిట్స్ కంటే ప్లాఫ్ చిత్రాలే ఎక్కువ‌. ఆయ‌న కెరీర్ గ్రాఫ్ కార‌ణంగానే రుద్ర‌మ‌దేవి త‌ర్వాత రానా ద‌గ్గుబాటితో చేయాల్సిన గుణ‌శేఖ‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిర‌ణ్య‌క‌శ్య‌ప ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు.. అంతలోనే ఖాళీగా ఉండ‌డం ఎందుకు అని త‌న స్వీయ నిర్మాణంలో ఆదిప‌ర్వంలోని శ‌కుంత‌ల దుష్యంతుల ప్రేమ‌క‌థ‌ను దృశ్య‌కావ్యంగా తెర‌కెక్కించ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఎలాగోల దిల్ రాజుని స‌మ‌ర్ప‌కుడిగా ఒప్పించాడు. ఇక శాకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహన్ ని ఖ‌రారు చేసి త‌న కూతురు నిర్మాత‌గా గ‌తేడాది మార్చిలో సినిమా ప్రారంభించాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది కాని అప్పుడే క‌రోనా ప్ర‌భావం ఎక్కువైంది. దాంతో ఔట్‌డోర్ షూటింగ్ చేయ‌డం ఇబ్బందిగా మారింది. ఇక చేసేదేం లేక అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్లోనే దాదాపు టాకీపార్టు మొత్తం పూర్తిచేశారు. ఇక విజ‌వ‌ల్ ఎఫెక్ట్స్ బాధ్య‌త‌లు ఓ ప్ర‌ముఖ కంపెనీకి అప్ప‌జెప్పారు.

సినిమా మొద‌లై దాదాపు ఏడాది కావొస్తుంది ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలి అనుకున్నారో ఏమో స‌డ‌న్‌గా Shakunthalam First Lookని విడుద‌ల‌చేశారు. అందులో స‌మంత ముని క‌న్య పాత్ర‌లో ఆశ్ర‌మంలో కూర్చుని ఉంది. ఆమె చుట్టూ నెమ‌ళ్లు, జింక‌లు, హంస‌లు ఇత‌ర వన్య ప్రాణులు నిలుచుని ఉన్నాయి. సాదార‌ణంగా హాలీవుడ్ సంస్థ డిస్నీ రూపొందించే చిత్రాల్లో పెద్ద అడవి. పచ్చటి పరిసరాలు.. అందులో జంతువులను చూసి మన పిల్లలు అబ్బుర‌పడుతుంటారు. ఈ పోస్ట‌ర్‌కి కూడా అలాంటి రెస్పాన్సే వ‌స్తుంద‌ని ఎద‌రుచూసిన చిత్ర యూనిట్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. స‌మంత లుక్‌పై నెటిజ‌న్లు పెద‌వివిరిచారు. దాంతో విప‌రీత‌మైన ట్రోలింగ్ మొద‌లైంది. దేవ క‌న్య‌లా స‌మంత‌ను చూపిస్తార‌నుకుంటే ఒక య‌క్షిణిలా చూపించారు అని కొంద‌రు నెగ‌టివ్ కామెంట్స్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ పోస్ట‌ర్లో ఎలాంటి క్రియేటివిటీ లేక‌పోగా, స‌మంత‌ను గుర్తుప‌ట్ట‌లేన‌ట్టుగా చూపించ‌డం ఆమె అభిమానుల‌కి కూడా మింగుడుప‌డ‌డంలేదు. దాంతో త్వ‌ర‌గా మ‌రో లుక్ రిలీజ్ చేయ‌మ‌ని గుణ‌శేఖ‌ర్‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read More: BheemlaNayak: టైటిల్‌ మార్చండి డైరెక్టర్‌ సలహా!Shakunthalam First Look: 

ట్రెండింగ్ వార్తలు