వరలక్ష్మి పెళ్లి ఖర్చు 200 కోట్లా… షాకింగ్ విషయాలు బయటపెట్టిన శరత్ కుమార్!

July 8, 2024

వరలక్ష్మి పెళ్లి ఖర్చు 200 కోట్లా… షాకింగ్ విషయాలు బయటపెట్టిన శరత్ కుమార్!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టారు నటి వరలక్ష్మి. కెరియర్ మొదట్లో తమిళంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో నెగిటివ్ పాత్రలలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇలా నెగిటివ్ పాత్రల ద్వారా ఈమె ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈమె ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వివాహం ముంబైలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ కూడా అంతే ఘనంగా జరిగింది.

ఈ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులకు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇంత ఘనంగా వరలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్లి ఖర్చు గురించి తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఓ వార్త వైరల్ గా మారింది. వరలక్ష్మి ఏకంగా తన పెళ్లి కోసం 200 కోట్ల వరకు ఖర్చు చేశారు అంటూ వార్తలు వచ్చాయి..

ఇలా తన కుమార్తె పెళ్లి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై శరత్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లికి 200 కోట్లు ఖర్చు అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అందరూ అనుకున్నట్టు నా కుమార్తె పెళ్లికి 200 కోట్లు ఖర్చు చేయలేదని తన పెళ్లి చాలా సింపుల్ గా చేసాము. ఇలా పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు చేసాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

Related News

ట్రెండింగ్ వార్తలు