రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో శర్వానంద్ కొత్త సినిమా.. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం!

March 5, 2024

రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో శర్వానంద్ కొత్త సినిమా.. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం!

చిరంజీవి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే శర్వానంద్ చిరంజీవి నటించిన థమ్సప్ యాడ్ ద్వారానే పరిచయం అయ్యాడు. అదే సంవత్సరం ఐదో తారీకు అనే సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. అయితే 2008 గమ్యం అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 2010 ప్రస్తానం సినిమా కూడా అతని కెరియర్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఇక 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమా నుంచి శర్వానంద్ జోరు మొదలైంది. శర్వానంద్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టిన సినిమా రన్ రాజా రన్.

మళ్లీమళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి సినిమాతో మంచి హిట్స్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మళ్లీ అందుకోలేకపోయాడు. 2022లో ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ మళ్ళీ ఇప్పటివరకు వెండితెర మీద కనిపించలేదు. గత ఏడాది వివాహం చేసుకున్న శర్వానంద్ ఈ సంవత్సరం సినిమాల జోరు పెంచాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు శర్వానంద్ . శ్రీరామ్ ఆదిత్య ఇంతకుముందు భలే మంచి రోజు, శమంతకమణి వంటి హిట్ సినిమాలు తీశాడు.

ఇక ఇటీవల అభిలాష్ రెడ్డి దర్శకత్వంలోనూ ఒక సినిమా పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి ఇప్పుడు తాజాగా సామజవరగమన చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్ . ఈ నెల రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం.

ఇది భిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దీంట్లో శర్వానంద్ సరసన సంయుక్తమీనన్, సాక్షి వైద్య కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాని నిర్మించడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొత్తకోణంలో చూపించబోతున్నట్లు సినీ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కబోతుంది.

Read More: పుష్ప రాజ్ స్టైల్లో అల్లు అయాన్.. తండ్రిని డిటో దించేశాడుగా?

ట్రెండింగ్ వార్తలు