January 28, 2022
Aadavallu Meeku Johaarlu: శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి చూడాలి గత కొంత కాలంగా సక్సెస్‌లేని శర్వానంద్ ఈ చిత్రంతోనైనా విజయం సాధిస్తాడో లేదో..
Aadavallu Meeku Johaarlu Release Date Poster: