శ్రీజ మంచి అమ్మాయి.. నా మనవరాలిని చూడాలని ఉంది: శిరీష్ భరద్వాజ్ తల్లి

July 2, 2024

శ్రీజ మంచి అమ్మాయి.. నా మనవరాలిని చూడాలని ఉంది: శిరీష్ భరద్వాజ్ తల్లి

మెగా డాటర్ శ్రీజ మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారని వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాదు అంటూ ఇటీవల తన తల్లి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అసలు విషయం వెల్లడించారు.

శిరీష్ భరద్వాజ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమారుడు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారని వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు. తాను కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు శిరీష్ భరద్వాజ్ తల్లి పేర్కొన్నారు. ఇక శిరీష్ మరణించినట్టు మెగా కుటుంబానికి తెలియజేసినప్పటికీ వాళ్ళు ఎవరు రాలేదని తెలిపారు. అంతేకాకుండా ఈమె శ్రీజ గురించి తన మనవరాలు గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు శ్రీజ చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తన ప్రేమించిన వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిందనే విషయం మాత్రం తనకు తెలియదని తెలిపారు.

ఇక తన మనవరాలు నివృత్తి అచ్చం తన తండ్రి శిరీష్ మాదిరిగానే ఉంటుందని తనని చూసిన ప్రతిసారి నాకు నా కుమారుడే గుర్తుకు వస్తారని ఈమె తెలిపారు. అందరిలాగే నాకు నా మనవరాలితో మాట్లాడాలని చూడాలని ఉంది అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీజ నా కొడుకు నుంచి విడిపోయిన తర్వాత మెగా కుటుంబం నుంచి మాకు 33 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇలా మా గురించి వచ్చిన వార్తలలో నిజం లేదని ఈమె తెలిపారు చాలామంది మెగా కుటుంబం నుంచి మాకు డబ్బు ఇప్పిస్తామని చెప్పారు కానీ మేము మాత్రం మాకు ఆ డబ్బు వద్దు ఆ డబ్బు పాప కోసమే వాడుకోమని చెప్పామని ఈమె తెలిపారు. ఇక తన భర్త కూడా ఇటీవల మరణించారని ప్రస్తుతం తాను తన రెండవ కుమారుడు వద్ద ఉంటున్నానని తెలిపారు. తనకు ఒకసారైనా తన మనవరాలిని కలిసి మాట్లాడాలని ఉంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Related News

ట్రెండింగ్ వార్తలు