May 16, 2024
సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా ఈయన మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మంగళగిరిలో తన ఓటు వేయడం కోసం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఆమెకు ఓటు హక్కు లేకపోయినా పవన్ కళ్యాణ్ ఆమెతోపాటు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా తన భార్యతో కలిసి పిఠాపురంలో కూడా పర్యటన చేశారు. ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ లో భాగంగా వారణాసికి వెళ్లే అక్కడ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు.
ఇలా ఎప్పుడు తన భార్యతో బయట కనిపించని పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తన భార్యను ఇలా బయటకు తీసుకురావడమే కాకుండా ఆలయాలను సందర్శిస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున అందరికీ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఇలా పవన్ కళ్యాణ్ తన భార్యతో బయటకు రావడం వెనుక గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే దీని వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చారని ఆమె ఇప్పటికే తన పిల్లలని తీసుకొని రష్యా వెళ్లిపోయింది అంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా మూడో భార్య కూడా విడాకులు ఇవ్వడంతో ఈయన నాలుగో పెళ్లికి కూడా సిద్ధమయ్యారంటూ ఈయన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఈ వార్తలన్నింటికి చెక్ పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ తన భార్యతో కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఇలా తను విడాకులు ఇవ్వలేదని ఇద్దరి మధ్య చాలా మంచి అన్యోన్యత ఉందని పవన్ ఇలా చెప్పకనే చెప్పేశారు.
Read More: పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్.. కాసేపట్లోనే వైరల్ అయిన వైనం!