ప్రభాస్ ఆ పని చేస్తే తనతో సినిమా చేస్తా… సాహో బ్యూటీ కామెంట్స్ వైరల్!

June 3, 2024

ప్రభాస్ ఆ పని చేస్తే తనతో సినిమా చేస్తా… సాహో బ్యూటీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలను విడుదల చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆయన పెట్టే భోజనం తినలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఇక సినిమా షూటింగ్లో ఉంటే కనుక లొకేషన్ ఉన్న వారందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను తెప్పించి తాను పెట్టే ఫుడ్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా నటి శ్రద్ధా కపూర్ ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ శ్రద్ధ కపూర్ కాంబినేషన్లో సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు ఈ ఫోటోల కింద ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ తిరిగి మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రద్ధ సమాధానం చెబుతూ నాకు ఎప్పుడైతే ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వస్తుందో అప్పుడే తిరిగి ఆయనతో నటిస్తానని తెలిపారు.

ఇలా ఈ సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు అయినా ప్రభాస్ పెట్టిన ఫుడ్ ఇంకా ఆమెకు గుర్తు ఉంది అంటే ప్రభాస్ ఏ రేంజ్ లో తనకు ఆతిథ్యం ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభాస్ శ్రద్ధ కోసం ఎప్పుడు తన ఇంటి నుంచి ఫుడ్ పంపిస్తారు ఎప్పుడు తనకు సినిమా అవకాశం ఇస్తారనేది తెలియాల్సి ఉంది.

Read More: రేవ్ పార్టీకి నన్ను పిలిస్తే బాగుండేది.. సంచలనం రేపుతున్న జబర్దస్త్ రీతూ కామెంట్స్!

Related News

ట్రెండింగ్ వార్తలు