మమ్మల్ని ఇడ్లీ సాంబార్ అని పిలిస్తే ఊరుకోము.. నోరు మూసుకొని వెళ్ళండి: శృతిహాసన్

June 21, 2024

మమ్మల్ని ఇడ్లీ సాంబార్ అని పిలిస్తే ఊరుకోము.. నోరు మూసుకొని వెళ్ళండి: శృతిహాసన్

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు కమల్ హాసన్ ఈయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి శృతిహాసన్. కెరియర్ మొదట్లో ఈమె పలు అవమానాలను ఎదుర్కోవడమే కాకుండా ఈమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే ట్రోల్స్ కూడా నడిచాయి.

ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఈమె అనంతరం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస హిట్టు సినిమాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నా శృతిహాసన్ ఒకవైపు సినిమాతో పాటు డకాయిట్ మరియు హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా సినిమాలు పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఈమెను ప్రశ్నిస్తూ.. సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా అంటూ ప్రశ్నించారు. అందుకు శృతిహాసన్ రియాక్ట్ అవుతూ.. ఓకే ఈ రకమైన జాతి వివక్షను నేను సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ దోస సాంబార్ ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము అస్సలు ఊరుకోము.

మీరు మమ్మల్ని అసలు అనుకరించలేరు అందుకే మాలా ఉండాలని ట్రై చేయొద్దు.. ఎలా పడితే అలా పిలిస్తే దానిని మేము తీసుకోలేము. ఇక సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పమని అడిగావు కదా నోరు మూసుకొని వెళ్ళు అంటూ ఈమె తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సౌత్ సెలబ్రిటీలను ఇడ్లీ సాంబార్ అని పిలిస్తే ఊరుకునేది లేదంటూ ఈమె కామెంట్ చేశారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో షారుక్ ఖాన్ రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ ఇడ్లీ వడ అంటూ పిలవడం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

Read More: పవన్ ముగ్గురిని కాకపోతే 30 మందిని చేసుకుంటారు మీకెందుకు: నటుడు సుమన్

ట్రెండింగ్ వార్తలు