ప్రభాస్ అనుష్కల పెళ్లి పై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. మాకేం అభ్యంతరం లేదంటూ?

June 8, 2024

ప్రభాస్ అనుష్కల పెళ్లి పై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. మాకేం అభ్యంతరం లేదంటూ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన హీరోగా బిజీగా ఉంటూ తన పెళ్లి గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నారు. ఈయన కన్నా చిన్నవారు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్ అయినప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

ఇక ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రభాస్ పలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.. ముఖ్యంగా ప్రభాస్ అనుష్క గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరు నిజానికి మంచి స్నేహితులు కానీ పెళ్లి చేసుకుని నిజ జీవితంలో కూడా ఒకటైతే బాగుంటుందని అభిమానులు భావించారు.

ఇక ప్రభాస్ అనుష్కల గురించి గతంలో కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రభాస్ అనుష్కను ప్రేమించారని కానీ తన పెదనాన్న కృష్ణంరాజు అందుకు ఒప్పుకోకపోవడంతో ప్రభాస్ అలాగే ఉండిపోయారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. అనుష్క ప్రభాస్ గురించి వస్తున్న వార్తలపై స్పందించిన ఈమె ప్రభాస్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ప్రభాస్ జీవితం తన ఇష్టం ఆయన ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు.ప్రభాస్ ది చాలా మంచి మనసు.. ఎంతో స్వచ్ఛమైనది. ఎదుటివాళ్ళ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతికే వ్యక్తి ప్రభాస్.. అంటూ శ్యామలా దేవి వెల్లడించారు. అలాంటి గొప్ప వ్యక్తి సంతోషం కంటే మాకు మరేది ముఖ్యం కాదు అని తెలిపారు.

Read More: రామోజీరావు మొదట్లో అలాంటి ఉద్యోగం చేశారా.. ఆయన అసలు పేరు అదేనా?

ట్రెండింగ్ వార్తలు