దానికోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్న సునీత.. ప్రతిఫలం దక్కిందంటూ పోస్ట్!

April 3, 2024

దానికోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్న సునీత.. ప్రతిఫలం దక్కిందంటూ పోస్ట్!

ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సునీత ఒకరు. ఈమె ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను ఆలపించడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈమె పలు కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సునీత ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత ఆయన వ్యవహార శైలి నచ్చకపోవడంతో తనకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఒంటరిగా జీవితంలో ముందుకు వెళుతూ తన పిల్లలను పెంచి పెద్ద చేసినటువంటి సునీత పిల్లల కోరిక మేరకు ఈమె రెండో వివాహం చేసుకున్నారు. ఇలా రెండో వివాహం తర్వాత తన జీవితం మొత్తం మారిపోయింది అంటూ ఈమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇటీవల కాలంలో కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు ఈమెకు పాటలు పాడటం ఎంత ఇష్టమో పచ్చని ప్రకృతిలో ఉండటం కూడా అంతే ఇష్టం అనే విషయాన్ని పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక ఈమెకు ఎప్పుడైనా వీలు దొరికిన ప్రతిసారి తన ఫామ్ హౌస్ లోనే చెట్ల మధ్య సమయాన్ని గడుపుతూ ఉంటారు అయితే తాజాగా సునీత తన ఫామ్ హౌస్ వెళ్లారని తెలుస్తుంది.

ఇలా ఫామ్ హౌస్ వెళ్లినటువంటి సునీత అక్కడ మామిడి చెట్ల మధ్య ఎంతో ఎంజాయ్ చేశారు ఇలా మామిడి పండ్లను చూసినటువంటి ఈమె మురిసిపోయారు ఇన్ని రోజులు కష్టపడి మామిడి చెట్లను పెంచానని దీంతో మామిడి కాయలు రావడంతో తన కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటూ ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్ లోని మామిడి పండ్లను చూపిస్తూ ఎంతగానో మురిసిపోతూ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: మెగా ఫ్యామిలీ అంతా కలిసి పండుగ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

Related News

ట్రెండింగ్ వార్తలు