గాగుల్స్ తో జబర్దస్త్ యాంకర్… ఆపరేషన్ చేయించుకున్నావా అంటున్న ఫ్యాన్స్?

April 8, 2024

గాగుల్స్ తో జబర్దస్త్ యాంకర్… ఆపరేషన్ చేయించుకున్నావా అంటున్న ఫ్యాన్స్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సిరి హనుమంతు ఒకరు. ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అనంతరం ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేశారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నటువంటి ఈమెకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం ద్వారా పాజిటివ్ కంటే నెగెటివిటీనే ఎక్కువగా ఎదుర్కొని బయటకు వచ్చారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఈమె కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పకున్న తర్వాత సౌమ్యరావు ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమం నుంచి సౌమ్యరావు కూడా తప్పుకోవడంతో సిరి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక సిరి అనసూయ లేని లోటును తీరుస్తున్నారని చెప్పాలి. ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైట్ కలర్ డ్రెస్ లో గాగుల్స్ పెట్టుకొని కిరాక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలపై చాలామంది క్యూట్ సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నావా ఏంటి సిరి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read More: వామ్మో సమంత ఏంటి ఇలా బాడీ పెంచేస్తుంది.. బన్నీ సినిమా కోసమేనా?

Related News

ట్రెండింగ్ వార్తలు