December 7, 2021
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి పాట న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రాశారు. ఈ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేకర్స్.
సిరివెన్నెల రాసిన ఆ పాటను ఈ రోజు విడుదలచేశారు. నాని, సాయి పల్లవిల ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాటకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయి పల్లవి మధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెలగారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.