అలా చెస్తే నాన్నకు అస్సలు నచ్చదు… మహేష్ సీక్రెట్ బయట పెట్టిన సితార!

May 27, 2024

అలా చెస్తే నాన్నకు అస్సలు నచ్చదు… మహేష్ సీక్రెట్ బయట పెట్టిన సితార!

సితార ఘట్టమనేని పరిచయం అవసరం లేని పేరు మహేష్ బాబు నమ్రత ముద్దుల కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమే. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసురాలుగా సితార ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇంత చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా సంపాదిస్తూ ఉన్నారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసే ఈమె మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ ఉన్నారు.

ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా చిన్న వయసులోనే భారీ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈమె అదే స్థాయిలో డబ్బు కూడా సంపాదిస్తున్నారు అయితే తాను సంపాదించిన దానిలో సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ తండ్రి బాటలోనే పయనిస్తున్నారు.

ఇలా చిన్న వయసులోనే స్టార్ గా సక్సెస్ అందుకున్నటువంటి సితార త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సితార తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు అలాగే మహేష్ బాబుకి సంబంధించి ఒక సీక్రెట్ కూడా ఈమె బయట పెట్టారు.

మహేష్ బాబుకు తన జుట్టును టచ్ చేస్తే చాలా చిరాకు అనే విషయాన్ని సితార వెల్లడించారు. ఎవరైనా నాన్న జుట్టును పట్టుకుంటే నాన్నకు చాలా చిరాకు వస్తుంది అప్పుడప్పుడు నేను కూడా నాన్న జుట్టును పట్టుకుంటూ తనని ఆటపట్టిస్తూ ఉంటానని సితార ఈ సందర్భంగా మహేష్ బాబుకి సంబంధించిన సీక్రెట్ బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఊరమాస్ ట్రైలర్

ట్రెండింగ్ వార్తలు