మూడవ సారి తండ్రి అయిన తమిళ హీరో.. నెట్టింట పోస్ట్ వైరల్?

June 4, 2024

మూడవ సారి తండ్రి అయిన తమిళ హీరో.. నెట్టింట పోస్ట్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శివ కార్తికేయన్ కూడా ఒకరు. ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు శివ కార్తికేయన్. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి విడుదల అవుతున్నాయి. తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్.

ఈ స్టార్ హీరో ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయం ఇస్తాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కూడా ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ తనకు బాబు పుట్టాడు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. శివ కార్తికేయన్ 2010లో తన చుట్టాలమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2013లో వీళ్లకు ఆరాధాన అనే పాప పుట్టింది. ఈ పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా కూడా అలరిస్తోంది. 2021లో గుగున్ అనే అబ్బాయి పుట్టాడు ఈ జంటకు.

తాజాగా ఈ జంట ముచ్చటగా మూడోసారి తల్లిదండ్రులు అయ్యారు. శివ కార్తికేయన్ కి బాబు పుట్టినట్టు తన సోషల్ మీడియాలో తెలపడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు శివకార్తికేయన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. కృతి శెట్టి రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్ వార్తలు