వేశ్య పాత్రలో నటించడం గౌరవంగా ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన శోభిత ధూళిపాళ్ల?

April 8, 2024

వేశ్య పాత్రలో నటించడం గౌరవంగా ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన శోభిత ధూళిపాళ్ల?

శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించే హీరోయిన్గా సక్సెస్ అయ్యారు అయితే ఈమె ఇటీవల కాలంలో నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా శోభిత పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

మరి వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనే విషయం గురించి ఇప్పటివరకు తెలియకపోయినా ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే శోభిత మాత్రం వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా పూర్తిగా తన కెరియర్ పైనే దృష్టి పెట్టారు ప్రస్తుతం ఈమె ఇండియన్ సినిమాలలో కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇలా హాలీవుడ్ సినిమా అవకాశమందుకొని ఈమె మంకీ మ్యాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కావడంతో తెలుగులో కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో శోభిత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు. ఈ సినిమాలో తాను సీత అనే ఒక వేశ్య పాత్రలో నటించబోతున్నానని తెలిపారు.

ఇలా వేశ్య పాత్రలో నటించడాన్ని తాను చాలా గౌరవంగా భావిస్తున్నానని తెలియజేశారు. తన పాత్ర సినిమాలో చాలా అద్భుతంగా ఉండబోతుందని మంచి ఆదరణ కూడా వస్తుందని ఈమె తెలియజేశారు. అయితే తాను ఎంపిక చేసుకునే సినిమాలలో కథ ప్రాధాన్యత కనుక ఉంటే తాను ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మరోసారి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Read More: అన్నా అంటూ అల్లు అర్జున్ కి విషెస్ చెప్పిన నిహారిక… ఫాన్స్ రియాక్షన్ ఇదే?

ట్రెండింగ్ వార్తలు