December 8, 2021
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `బూట్ కట్ బాలరాజు`. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “గత ఆరేడు నెలలుగా సోహెల్‌తో ఒక పాయంట్ అనుకుని దాన్ని ఒక కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. కోనేటి శ్రీను నా మిత్రుడు చాలా ఏళ్లుగా మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇలాంటి కథ సోహెల్ కి కరెక్ట్. హుశారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్‌కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం“ అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ – “బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది“ అన్నారు.
అనన్య నాగళ్ల మాట్లాడుతూ – “మల్లేశం సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. ఈ సినిమాలో కొంచెం బబ్లీగా ఉండే క్యారెక్టర్. నాకు చాలా ఇష్టమైన పాత్ర. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్“ అన్నారు.
దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ – “బూట్‌కట్ బలరాజు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా“ అన్నారు.
శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్‌దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు